www.teluguminikavithalu.blogspot.com

Saturday, February 21, 2015

ప్రతీ క్షణం....


ప్రతీ క్షణం నీ పెదవి పలుకుకై పరితపించా....

ప్రతీ క్షణం నీ రూపురేఖనే చిత్రించా....

ప్రతీ క్షణం నీ నీడ కోసమే నీరిక్షించా....

ప్రతీ క్షణం నీ జాడ కోసమే అన్వేషించా....

                                                 -- దయా

Friday, December 5, 2014

నా నమ్మకానికి.... అమ్మకం



నా మెదడు నేర్పింది...
           నన్ను తప్ప ఇంకొకరిని నమ్మొద్దని,

నా చదువు నేర్పింది...
            నా శక్తిని తప్ప వేరేవాటిని నమ్మొద్దని,

నా జీవితం నేర్పింది...
             అమ్మాయిలని అస్సలు నమ్మొద్దని,

నా మనసు నేర్పింది... 
             అందమైన వాటిని అంతతొందరగా నమ్మొద్దని,

   అయినా... నిన్ను నమ్మాను....    ఇందుకేనా.....

Sunday, November 9, 2014

నీ స్నేహ బంధం...


పువ్వుల వలే విరబూసిన సుమ గంధం...
బాధల్లో తోడుండే అను బంధం...
నవ్వులతో నడిపించే మకరంధం...
ఏప్పటికి తోడుండే నీ స్నేహ బంధం...
నాకు అందించెను జీవితమంతా మహదానందం.....

Wednesday, October 15, 2014

కలల కావ్యం....



కల కాని ఈ ప్రపంచం లో కలలా  కలిసి

            అలలా కనుమరుగైన ఓ కలల కావ్యమా....

 
నీ కోసమే నా ఎదురుచూపూలు...

నీ కోసమే నా పడికాపులు...

నీ కోసమే నా ఊహలు...

నీ కోసమే నా కవితలు...  

Monday, October 13, 2014

నువ్వు అంటే

అమ్మ అంటే అనురాగానికి అసలైన అర్ధం...

నాన్న అంటే ముందుకు నడిపే మంచి మనసు...

అన్న అంటే ఆదరించే అందమైన హృదయం...

నువ్వు అంటే గుండెల్లో కొలువుండే గొప్ప రూపం... 

Sunday, October 12, 2014

నీ చిరునవ్వుల జల్లు......


నిన్ను ప్రేమించిన క్షణం నుంచి నీ ప్రేమ కోసమే అనుదినం ఆలోచిస్తూ..
        నా జీవనాన్ని ఎడారిలో బాటసారిగా సాగిస్తున్నా...!
అటువంటి నాకు కనిపించిన నీ చిన్ని చిరునవ్వుల జల్లు చూసి,
        ఎడారిలో ఒయాసిస్ దొరికిన వాడిలా,
        ఎండమావిలో నీటి ఊటను చూసిన వాడిలా,
        ఆనందిస్తుంటే నాలో కలిగెను ఒక చిన్న భయం...
ఆ నవ్వుల జల్లు నా పాలిట ముల్లు అవుతుందేమో అని..
       ఎండమావిలో నీటి జాడలా అనుక్షణం కనిపించినట్లు కనిపించి
       దగ్గరకు వెళ్తే మాయం అవుతుందేమో అని...!

అయిన నీ మనసులో స్థానం కోసం ప్రతిక్షణం ప్రయత్నించి ప్రయత్నించి నేను కనుగొన్న విషయం...
       నీ ప్రేమని గెలుచుకోవడం కంటే, ఎడారిలో ఒయాసిస్ ను కనిపెట్టడం తేలిక అని అయినా...
            "ప్రతిక్షణం నీకోసమే శ్వాసిస్తా...  నిన్ను చేరకపోతే శ్వాసనే వదిలేస్తా..."

Saturday, August 23, 2014

నీ రూపం...


నా కనురెప్పలు విప్పినప్పుడు కనిపించిన తేజోమయం, నీ రూపం...

నా తలపులు నిను వదిలినప్పుడు కనిపించిన అపురూపం, నీ రూపం....

నా మనసు మురిసినప్పుడు కనిపించిన కలలకావ్యం, నీ రూపం.....

నా ప్రాణాలు కుదుటపడినప్పుడు కనిపించిన రమణీయం, నీ రూపం.......!
                                                                               --- దయా

Sunday, July 20, 2014

నీ ప్రేమతో....


నీ ప్రేమతో నిద్దురపోయిన నా హృదయాన్ని నీ వైపు నడిపించావు...

నీ ప్రేమతో కలలు కనే ఓ కవిని కవ్వించావు...

నీ ప్రేమతో మోసానికి మరో మార్గం మగువ మాటలని తెలియజేసావు...

నీ ప్రేమతో ప్రపంచానికి ఓ పిచ్చివాన్ని పరిచయం చేసావు..... 

నా మనసు...


చీకటి ఉన్నప్పుడే చందమామ వెలుగు తెలుస్తుంది...

సాన పెట్టినప్పుడే వజ్రం విలువ తెలుస్తుంది...

ఓడినప్పుడే గెలుపు గొప్పదనం తెలుస్తుంది...

ప్రేమించినప్పుడే ప్రేమ గురించి తెలుస్తుంది...

నా కవిత చదివినప్పుడే నా మనసు నీకు తెలుస్తుంది..... 

Monday, July 14, 2014

నీ సొంతం....


నా కన్నులు కనే కలలు నీ  సొంతం....

నా పెదవి పలికే పలుకు నీ సొంతం....

నా వయసు దోచే సొగసు నీ సొంతం...

నా మనసు  కోరే మధుర రూపం నీ సొంతం.... 

Sunday, June 29, 2014

నీవే నా ఊపిరి...


నిన్ను చూసిన సమయాన నిదుర లేదులే నా హృదయాన....!

కనులు తెరచి కలలను కంటు... కధను మరిచి యధ నిన్నే చూస్తుంది...

      ఆ క్షణం నుంచి నిన్ను తలుచుకోని క్షణం లేదు...

      నీ పేరు పలుకని గడియలేదు...

      నీ రూపు ఉంహించని రోజు లేదు...

      నిన్ను మరచితే నా ఊపిరి లేదు...... 

నీవు చలించకు....


సముద్రం పొంగినది అని భూమి చలించదు...

భూమి కంపించినది అని ఆకాశం చలించదు...

ఆకాశం అదిరిపడుతుంది అని ప్రకృతి చలించదు...

ప్రకృతితో నిండిన ఈ లోకం నిన్ను చిన్న చూపు చూసిందని నీవు చలించకు.....

-- దయా

Friday, June 6, 2014

కవిత


కవిత అంటే మనసులో  ఉన్న భావానికి  కలం అందించే రూపం...

కవిత అంటే కళ్ళలో దాగి ఉన్న కలలను కరిగించే దీపం...

కవిత అంటే హృదయంలో ఉన్న గుర్తులను చూపించే దృశ్యం...

కవిత అంటే మనిషిలో ఉన్న మనసున నిలచే విశ్వం...

కవిత అంటే కదలకుండా ఉన్న హృదయాలను కరిగించే కమ్మని కావ్యం.... 

నీ రూపం సూర్యబింబం....


-- రాత్రికే రారాజు అయిన చంద్రునికి సైతం

          తన ప్రకాశానికి అడ్డంకులు ఎన్నో ఉన్నాయి...

-- కాని నీ రూపం సూర్యబింబంలా సంపూర్ణ కాంతితో ప్రకాశిస్తుంటే,

          నీ ముందు నేను పట్టపగలు వెలిగిన విద్యుత్ దీపంలా వెలవెలబోతున్నా...!!!

Wednesday, June 4, 2014

నీవు లేని నేను లేను.....

ఎండ లేని రోజు ఉండవచ్చు

వాన రాని రోజు ఉండవచ్చు

ఆకు లేని చెట్టు ఉండవచ్చు

నీరు లేని చోటు ఉండవచ్చు

కాని నీవు లేని నేను లేను...